CM KCR Cabinet Meeting Decision Today TSRTC Video: KCR Press Meet Live RTC and Cabinet Decisions Live: CM KCR Chairs Press Meet To Announce Key Decisions On TSRTC Future After Completion Of Cabinet Meet. CM KCR Key Decisions To Be Made During Cabinet Meeting
The Telanagana Chief Minister KCR has scheduled to hold Telangana Cabinet meeting in Pragathi Bhavan on November 2 at 3 PM. In this Meting CM KCR is to review the current situation of the TSRTC strike which entered the 29th day on November 2 . He has also decided to take the key decision over the agitating RTC employees. CM KCR is also to take key decision over several issue pertaining to the state.
CM KCR Cabinet Meeting Decision Today
రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రెండు విషయాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినయి. వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ అధికారులు, చీఫ్ ఇంజినీర్లను పిలిచి రోడ్ల గురించి మాట్లాడినం. పాడైన జాతీయరహదారులను పట్టించుకునే నాథుడే ఉండరు.
నేషనల్ హైవేలపై కనీస నిర్వహణ ఉండదు. రాష్ట్రంలోని హైవేలు, ఇతర రోడ్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు చేస్తం. రోడ్ల మరమ్మతులకు రూ.571 కోట్లు వెంటనే మంజూరు చేశామని తెలిపారు. వీలైనంత తొందరలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
ధాన్యం కొనుగోలుపై చర్చలు జరిగాయి. ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించినం. పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దాదాపు 1500 నుంచి 1800 చెరువులు నింపుకున్నం. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. రాజరాజేశ్వర ప్రాజెక్టు(మిడ్‌మానేరు) వరకు కాళేశ్వరం విజయవంతంగా నడుస్తోంది.
ఏ స్థాయి వరకు ప్రాజెక్టు నింపుకోవాలనే దానిపై ఓ పద్దతి ఉంటుంది. మిడ్‌మానేరును 20.9 టీఎంసీల దాకా నింపినం. ఎల్లంపల్లి కూడా నింపుకున్నం. ఎస్సారెస్పీలో ఇప్పుడు 90 టీఎంసీల దాకా నీళ్లు ఉన్నాయి. మూడు బ్యారేజీలు కలిసి 60 టీఎంసీలు గోదావరి నుంచి వస్తున్నాయి. సూర్యపేట జిల్లాలో 2.76 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం గొప్ప విషయం. సీతారామ, దేవాదుల త్వరలో పూర్తి కాబోతున్నాయని పేర్కొన్నారు.