& News Govt jobs

CM KCR Speech in Nalgonda TRS Mmeeting – Pragathi Ashirwada Sabha

CM KCR Speech in Nalgonda TRS Mmeeting: K Chandra Sekahar Rao has started his public meetings in the districts in the rum-up to the elections and he addressed a public meeting yesterday at Nizamabad and today he visited Nalgonda to attend Pragathi Ashirwada Sabha.

CM KCR has slammed the Congress leaders for keeping silent when Nandikonda project was changed and shifted to Nagarjunasagar and also pointed out Congress lack of commitment to the Telangana.

CM KCR Speech in Nalgonda TRS Mmeeting

Telangana Cm KCR Full Speech.kcr holds a Public Meeting Praja Ashirvada Sabha in Nalgonda district after a successful public meeting in Nizamabad.

 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నరకం అనుభవించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శివారులో మర్రిగూడ బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ కూడా మనకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని ఏం చేశారో తెలుసు. కుడి, ఎడమ కాల్వల విషయంలో 2002లో నాడు సీఎం చంద్రబాబును నిలదీయడం జరిగింది.

కుడి కాల్వకు ఓ నీతి, ఎడమ కాల్వకు మరోనీతి ప్రదర్శించారు చంద్రబాబు. ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ నోరు తెర్వలేదు. డిండి ప్రాజెక్టులో బండలు తేలితే నోరు తెరిచి మాట్లాడలేదు. నరకం అనుభవించింది నల్లగొండ. విషం తినే పరిస్థితికి వచ్చింది. 1,50,000 మంది ఫ్లోరైడ్ వల్ల నాశనం అయ్యారు. మునుగోడు, దేవరకొండలో జరిగిన మానవ విధ్వంసానికి ఎవరు కారకులు? ఫ్లోరైడ్ సమస్యపై ఓ పాటల సిడీ ఏర్పాటు చేసి నల్లగొండ పరిస్థితిపై ప్రచారం చేశాం.

దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరైడ్ సమస్యపై కొట్లాడిండు. నాటి ప్రధాని వాజపేయి ముందు ఫ్లోరైడ్ సమస్యను సత్యనారాయణ వినిపించిండు. ఆయన టేబుల్ మీద ఓ బాధితుడిని పండుకోబెట్టి వేడుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్య తీరబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Comments are closed.