& News Govt jobs

How to Register Voters List in Telangana State

0

How to Register Voters List in Telangana State: The After dissolving the Telangana assembly on September 6 2018, the Election Commission of India is gearing up for the ensuing elections and is likely to hold the polls at the end of the year.

Citizens who are Telangana State and already have a voter ID card, but it is from a place other than Telangana and now you have moved back to the State; enrolling is simple now a days.

How to Register Voters List in Telangana State

How to Register Voters List in Telangana State

It has become very easy to enroll in the voters’ list with just a few clicks

Here’s the procedure

  • Log on to the website of Chief Electoral Officer, Telangana and click on the ‘ E-registration’.
  • Select your constituency name by clicking on Assembly constituency and select ‘Form 6’ from the options
  • Select as ‘First time voter’ if you are going to vote for the first time in the form and fill all the details in it like name, address and so on.
  • Upload scanned copies of the documents required for age and address proof and click on submit.
  • The applicant will then receive an application reference number with a tracking number.
  • An officer will pay a visit to the address to confirm the details after the application is being processed.
  • After the verification, the voter ID will be sent through the post.

Important pointers

If you are a citizen of Telangana and already have a voter ID card, but it is from a place other than Telangana and now you have moved back to the State; enrolling is simple. It’s the same as above but instead of selecting the ‘As a first time voter’, select the ‘due to shifting from another constituency’

On the same website, ‘Form 8’ under the ‘Assembly Constituency’ tab can be used for corrections in the voter ID. If there is a correction in the name, date of birth, address, etc, Form 8 can be filled with necessary details and the voter ID will be corrected.

If you have shifted your residence within the same constituency, then ‘Form 8A’ can be used to transfer the name to a relevant part of the voters roll in the same constituency.

Check the status of your application under the ‘Assembly Constituency’ tab by clicking on ‘Know Your Status’.

ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా

మీ ఒక ఓటు దేశ భవిష్యత్ ను మార్చవచ్చు,ఓటు ను తెలిసి,తెలియక,వృధా చేసికోకండి,మన రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడుకి ఓటు హక్కు కల్పించింది.దీనిని సద్వినియోగం చేసికోవడం ప్రతి  పౌరుడిది భాద్యత.ఎన్నికల నిర్వహణ భాద్యత,మన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన భారత ఎన్నికల కమీషన్ పర్యవేక్షణలో ఉంది.
భారత పౌరుడు అయి,18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్వక్తి ఓటరు గా నమోదు కావచ్చు.ఈ ప్రక్రియ ప్రతి  సంవత్సరం కమీషన్ తన సిబ్బంది తో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తుంది.బూత్ లెవెల్ లో, ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహస్తారు.ఇలా కాకుండా ఆన్లైన్ లో కూడా మీ పేరు నమోదు ఎప్పుడైనా చేసికోవచ్చు. దీనిని ఎలా చేయాలో చూద్దాం.
ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ఆ సంవత్సరం జనవరి 1 వ తేది నాటికీ 18 ఏళ్ళు నిండి ఉండాలి. ప్రస్తుతం ఓటు నమోదు చేసుకునే వారి వయస్సు జనవరి 1  2018 నాటికీ 18 ఏళ్ళు నిండి ఉండాలి. 

వివిధ రకాల ఫారాలు:- 

FORM :6  :-కొత్త ఓటర్ గా నమోదు అయ్యే వారు ఈ ఫాం ఉపయోగించాలి. లేదా గతంలో ఓటర్ గా నమోదు అయి తమ నివాసం (అసెంబ్లీ నియోజకవర్గం మారితే) మారిన వారు కూడా ఇదే ఫాం లో అప్లై చేయాలి.లేదా తమ నివాసం మారడం వల్ల ఓటు ను ఓటర్ల లిస్టు నుండి తమ పేరు తొలగించిన వారు కూడా ఇదే ఫాం లోనే అప్లై చేయాలి.

FORM :7 :-  ఓటర్ల లిస్టు లలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ ఫాం ని ఉపయోగించాలి.  
FORM :8 :- మీ ఓటర్ కార్డు లో ఏమైనా తప్పులు ఉంటే,వాటిని సరిచేయడానికి ఈ ఫాం ని ఉపయోగించాలి. FORM :8A:- మీ నివాసం అదే అసెంబ్లీ నియోజక వర్గంలో మారితే,మీ ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చడానికి  ఈ ఫాం ని ఉపయోగించాలి.
ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం.ఆన్లైన్ లోకి వెళ్ళే ముందు ఈ క్రింది ధృవపత్రాలు(డాక్యుమెంట్లు) సిద్దంగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లో ఉంచుకోవాలి.
1) పాస్ పోర్ట్ సైజు ఫోటో (PHOTO)
2) వయస్సు ధృవీకరణ పత్రం (Age Proof)
3) అడ్రస్  ధృవీకరణ పత్రం(Address Proof)
1) పాస్ పోర్ట్ సైజు ఫోటో (Photo):- మీ పాస్ సైజు ఫోటో ను స్క్రాన్ చేసి,దాని సైజు (3.5*3.5) 100kb, మరియు JPG ఫార్మెట్ లో ఉండెలాచేసి,మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లో సిద్దం గా ఉంచుకోవాలి.
2) వయస్సు ధృవీకరణ పత్రం(Age Proof):-మీ వయస్సు ను ధృవీకరణ చేసే పత్రం స్క్రాన్ చేసి,దాని సైజు 100kb మరియు JPG ఫార్మెట్ ఉండెలా చేసి,మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లో సిద్దం గా ఉంచుకోవాలి.    
వయస్సు ధృవీకరణ పత్రాలు :-1) ఆధార్ కార్డు(దానిపై పుట్టిన తేది ఉండాలి) 2) జనన ధృవీకరణ పత్రం,(Date of birth) 3) మీ పాస్ పోర్ట్  4) అకాడమిక్ సర్టిఫికెట్స్(Academic Certificates) అంటే SSC MEMO, Tranfer Certificate(TC), Study Certificate.వీటిని మీ వయస్సు ధృవీకరణ పత్రాలు గా గుర్తిస్తారు. 
3) అడ్రస్ ధృవీకరణ పత్రం (Address Proof) :-మీ అడ్రస్ ను ధృవీకరణ చేసే పత్రం స్క్రాన్ చేసి,దాని సైజు 100kb మరియు JPG ఫార్మెట్  ఉండెలా చేసి,మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లో సిద్దం గా ఉంచుకోవాలి.     
 అడ్రస్ ధృవీకరణ పత్రాలు -1)ఆధార్ కార్డు(దానిపై మీ ప్రస్తుత నివాసం నమోదు అయి  ఉండాలి) 2) బ్యాంకు/కిసాన్/పోస్ట్ ఆఫీస్ ప్రస్తుత పాస్ బుక్,పై మీ ప్రస్తుత నివాసం నమోదు అయి ఉండాలి. 3) రేషన్ కార్డు /పాస్ పోర్ట్ /డ్రైవింగ్ లైసెన్స్,పై మీ ప్రస్తుత నివాసం నమోదు అయి ఉండాలి. 4) ప్రస్తుత నీటి పన్ను రసీదు/ఫోన్ బిల్/కరెంటు బిల్/గ్యాస్ డాక్యుమెంట్,పై మీ ప్రస్తుత నివాసం నమోదు అయి ఉండాలి.ఈ పత్రాల పై మీ పేరు లేదా మీకు  సంబంధించిన వారి పేరు పై ఉండాలి అంటే తల్లిదండ్రులు/భర్త /భార్య.
పై పత్రాలు స్క్రాన్ చేసి పైన సూచించిన సైజు లో పెట్టుకోవాలి. తర్వాత 

మీరు తెలంగాణా రాష్ట్రం  వారు అయితే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://ceotelangana.nic.in/

మీ పై లింక్ ను క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి ప్రవేశించిన తరువాత E- Registration పై క్లిక్ చేయండి.
1) Assembly constituency

2) Council constituency అనేవి వస్తాయి, Assembly constituency పై కల్సర్ పెడితే పక్కన వివిధ రకాల ఫారం లు కనబడతాయి,మీ కొత్త ఓటర్ లేదా మీ పేరు ఓటర్ల లిస్టు నుండి తొలగించబడితే ఫారం 6 ను క్లిక్ చేయండి.ఒక పేజి ఓపెన్ అవుతుంది.ఆ పేజి లో మీ జిల్లా ,మీ అసెంబ్లీ నియోజక వర్గం సెలెక్ట్ చేయండి.తర్వాత మీ ఫోటో, వయస్సు దృవీకరణ పత్రం,అడ్రస్ దృవీకరణ పత్రం,UPLOAD చేయండి.క్రింది భాగం లో మీ పేరు,(ఆధార్ కార్డు ఉంటే దానిలో ఉన్నట్టు),ఇంటి పేరు,తప్పులు లేకుండా పూర్తీ చేయండి,మీరు ఇంగ్లీష్ లో రాస్తే అదే తెలుగు లో మీ పేరు రాస్తుంది,తెలుగు లో పేరు కరెక్ట్ గా ఉందొ లేదో సరిచూడండి.లేకపోతే మీ కంప్యూటర్ లో తెలుగు సాఫ్ట్వేర్ ఉంటే ఆ గడిని మీరే టైపు చేయండి. Relative Name లో మీ నివాస ప్రాంతం లో ఇది వరకే ఓటర్ల లిస్టు లో నమోదు అయి ఉన్న మీ సమీప బంధువు పేరు రాయండి.వెరిఫికేషన్ లో మిమ్మల్ని గుర్తించడానికి ఇది అవసరం.
తరువాత పుట్టిన తేది కచ్చితంగా తెలిస్తే,మీ జనన ధృవీకరణ పత్రం,(Date of birth) లో ఉన్నట్టు రాయండి.పుట్టిన తేది లేకపొతే ఆ సంవత్సరం జనవరి 1 నాటికీ వయస్సు రాయండి.
మీ ప్రస్తుత అడ్రస్ పూర్తీ చేయండి, ఇది మీ శాశ్వత అడ్రస్ ఒకటే అయితే డబ్బాలో క్లిక్ ఇవ్వండి.
మెయిల్ మరియు మొబైల్ నెంబర్ రాయండి.ఈ మొబైల్ కే మెసేజ్ వస్తుంది,కాబట్టి తప్పులేకుండా మొబైల్ నెంబర్ రాయండి.మీ గ్రామ రెవిన్యూ అధికారి(VRO) వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని సంప్రదించడానికి ఇదే మొబైల్ నెంబర్ కు ఫోన్ చేస్తారు.తరువాత 
డిక్లరేషన్ ను జాగ్రత్త చదవండి.దీనిలో మీ పుట్టిన ఊరు  మరియు జిల్లా,రాష్టం, రాయాలి.
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం లో నివాసం ఉంటున్నారో రాయాలి.
చివర ఈ దరఖాస్తు ఎక్కడి నుంచి ఆన్లైన్ చేస్తున్నారో అంటే గ్రామం/పట్టణం పేరు రాయాలి మరియు తేది వేయాలి.
చివర ఉన్న కోడ్ ను డబ్బా లో రాసి మరొక సారి వివరాలు సరిచూసుకోండి.సబ్మిట్ పై క్లిక్ చేయండి.
మీ రసీదు వస్తుంది.దాని పై ఉన్న నెంబర్ ను రాసుకోండి.ఈ నెంబర్ మీ దరఖాస్తు పరీశీలన ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి కావాలి.
FORM :8A:- మీ నివాసం అదే అసెంబ్లీ నియోజక వర్గంలో మారితే,మీ ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చడానికి  ఈ ఫాం ని ఉపయోగించాలి.
మీరు ఇదే అసెంబ్లీ నియోజక వర్గంలో ఉన్నారు కానీ నివాస స్థానంమారింది, అప్పుడు ఈ ఫారం లో ఆన్లైన్  చేయాలి.
మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి, పైన  లింక్ ను క్లిక్ చేసి SEARCH YOUR NAME పై క్లిక్ చేయండి,తరువాత వచ్చే పేజి లో మీ జిల్లా ,మీ అసెంబ్లీ నియోజక వర్గం సెలెక్ట్ చేయండి,మీ పేరు లేదా హౌస్ నెంబర్ లేదా మీ ఓటర్ఐడి కార్డు నెంబర్ ను నిర్ణిత గడి లో రాయండి.మీ పేరు ఓటర్ల లిస్టు లో ఉంటే మీ పేరు డిస్ప్లే అవుతుంది.దానిలో పార్ట్ నెంబర్ మరియు సీరియల్ నెంబర్ రాసుకోండి,ఇవి ఫారం 8 పూర్తీ చేసే తప్పుడు కావాలి ,ఈ ఫారం ని కూడా పై విధంగా  ఆన్ లైన్ చేయండి.
 మీ గ్రామ రెవిన్యూ అధికారి(VRO) వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు,అప్పుడు రెండు ఫోటోలు మరియు మీ ఆన్లైన్ లో UPLOAD చేసిన డాకుమెంట్స్ యొక్క జిరాక్స్ కాపీ లు ఇవ్వాలి.

Leave A Reply

Your email address will not be published.