Minister Malla Reddy Audio Tape Leaked – Rapolu Ramulu Vs Malla Reddy: మంత్రి మల్లా రెడ్డి,టీఆర్ఎస్ నేత రాపోలు రాములుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో టికెట్ల కేటాయింపు పై నేతల మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వారికి టికెట్లు కేటాయించడం లేదని రాములు నిలదీశారు. నీపై నమ్మకం పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు.
మల్లారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అయన వినలేదు. నీ వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెబుతానని అన్నారు. మంత్రి కేటీఆర్ కు కూడా నీ గురించి చెబుతానని బెదిరించడంతో చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద డబ్బులు డిమాండ్ చేసిన రికార్డులు తన వద్ద ఉన్నాయని అవన్నీ బయటపెడతానని వాటిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని రాపోలు రాములు హెచ్చరించారు.
రాపోలు రాములు కు చెందిన వ్యక్తి రమేష్ కు టికెట్ కేటాయించకపోవడంతో అయన తీవ్రంగా అసంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. దీంతో మల్లారెడ్డికి సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని అవన్నీ పోలీసులకు ఇస్తానని రాములు బెదిరింపులకు దిగడం సంచలనంగా మారింది.
Minister Malla Reddy Audio Tape
TRS Leader Rapolu Ramulu Warning To Minister Malla Reddy For Boduppal Municipal Ticket | TRS Phone call leak
Rapolu Ramulu Vs Malla Reddy
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి మల్లారెడ్డికి ఆది నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పుడు తాజాగా అధికార టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి మంత్రి మల్లారెడ్డి రూపంలో ఎదురైందని చెప్పాలి.
ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు రావటమే కాదు.. వైరల్ గా మారింది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి తనను రూ.50 లక్షలు డిమాండ్ చేశారంటూ బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
source from sakshi