& News Govt jobs

Syska US co 500cr LED lights Manufacturing unit in Telangana

The Pune-based SYSKA LED will set up Rs. 500-crore LED lights manufacturing unit in Telangana. The firm, which will be established in a plot of 50 acres, is expected to create 2,000 jobs.

LED lights Manufacturing unit in Telangana

LED lights Manufacturing unit in Telangana

Representatives of the company, led by its Director Rajesh Uttamchandani, met Telangana Chief Minister K Chandrasekhara Rao to brief him about the proposed project.

“The Chief Minister has assured them of all help in setting up the manufacturing plant in the State,” a statement from the Government said on Monday.

Representatives of Advanced Optronic Devices (AOD) of the United States have also met the Chief Minister to moot a proposal to set up a unit in the State.

AOD Chief Executive officer Pratap Kandamuri was among the executives that the Chief Minister at the Camp Office would discuss the plan.

హైదరాబాద్ లో ఎల్ఇడి లైట్ల తయారీ యూనిట్ స్థాపించడానికి అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ అడ్వాన్స్డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్(Advanced Optronic Devices (International) Inc.) ముందుకొచ్చింది. యూనిట్ స్థాపించడానికి అవసరమయ్యే భూమి సమకూర్చడంతో పాటు అన్ని విధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఎఓడితో పాటు భారత్ కు చెందిన సేల్స్ కంపెనీ సిస్కా రూ. 500 కోట్ల పెట్టుబడితో, దాదాపు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 50 ఎకరాల విస్తీర్ణంలో ఎల్ఇడి లైట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధపడింది. మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా స్థాపిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

సిస్కా డైరెక్టర్ రాజేష్ ఉత్తమ్ చందాని, ఎఓడి సిఇవో ప్రతాప్ కందమూరి, జిఎం రవి ఇంద్రాణి, డైరెక్టర్ ఆండ్రెస్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. యూనిట్ స్థాపనపై తమ ప్రతిపాదనలు అందించారు. వారికి అవసరమయ్యే సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మార్చి నుంచే ఉత్పత్తులు ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పగా, భూమితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు వీలైనంత తక్కువ సమయంలో సమకూరుస్తామని సిఎం చెప్పారు. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగు అందించే ఎల్ఇడి లైట్ల వాడకం పెరగాల్సి ఉందని కూడా సిఎం అభిప్రాయపడ్డారు. వాటి వాడకం పెరిగిన కొద్దీ డిమాండ్ పెరుగుతుందన్నారు.

తెలంగాణలో పరిశ్రమల స్థాపన కోసం తెచ్చిన టిఎస్ ఐపాస్ చట్టం సత్ఫలితాలు ఇస్తున్నదని, ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులిచ్చామని వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ‘బిజినెస్ ఎట్ ఈజ్’ అనే పద్దతిలో తెలంగాణలో పారిశ్రామిక విధానం ఉన్నదన్నారు. హైదరాబాద్ నగరంలో త్వరలో ఫార్మా సిటి, సినిమా సిటి రానున్నాయని, ఐటి కంపెనీలు కూడా తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే పెట్టుకుంటున్నారన్నారు.

సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, టిఎస్ఐఐసి ఎండి ఇ.వి. నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.