Koratala Siva & Chiranjeevi 152 Movie Name, Heroine, Release Date, Wiki & Details: Chiru 152 is an action-entertainer with a Naxalism backdrop directed by Koratala Siva and produced by Niranjan Reddy & Ram Charan.
Chiranjeevi plays the lead role and will be seen in two different avatars, as 30-year-old Govind and a middle-aged man Acharya. Mani Sharma is set to score music.
Chiranjeevi 152 Movie Name
After playing a freedom fighter in Sye Raa Narasimha Reddy, which earned Rs 160 crore over its extended five-day opening weekend, Chiranjeevi has boarded the cast of Koratala Siva’s next film. According to News, the film, tentatively titled Chiru 152, was launched on Dussehra with a formal puja ceremony by the actor.
రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల అనతికాలంలో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించారు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Koratala Siva Chiranjeevi Movie
చిరంజీవి 152వ సినిమా మొదలైపోయింది. ఈరోజు విజయదశమిని పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో అభిమానులకు బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చారు మెగా స్టార్ చిరంజీవి. అంతకుమించిన కిక్ ఇస్తానంటున్నారు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు దసరాను పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిరంజీవి నటించనున్న 152వ సినిమా ఇది. చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి, కుమారుడు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.
Chiranjeevi 152 Movie Story
ఆలయాల వెనుక అవినీతి.. చిరు, కొరటాల సినిమా కాన్సెప్ట్ ఇదే!!
అయితే, చిరంజీవితో తొలిసారి పనిచేస్తోన్న కొరటాల శివ ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నారు అనే చర్చ ప్రస్తుతం సినీ పరిశ్రమలో మొదలైంది. ఈ చర్చలో భాగంగానే కథకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమా అట. ఈసారి శివ ‘ఆలయాలపై నిర్లక్ష్యం, వాటి వెనుక జరుగుతోన్న అవినీతి’ అనే కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకున్నారని టాక్.
ఆలయాలపై నిర్లక్ష్యం వహించడం, ఆలయ భూములను పక్కదారి పట్టించడం వల్ల దాని ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది, దీన్ని చక్కదిద్దడం కోసం హీరో ఏం చేశాడు వంటి అంశాలను సినిమాలో చూపించనున్నారని అంటున్నారు. దీంతో పాటు చిరంజీవి స్టైల్లో మసాలా ఎలిమెంట్స్‌కు కూడా కొదవ ఉండదు అని సమాచారం.
అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఆలయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆలయ భూములను అక్రమంగా కొట్టేసే రాజకీయ నాయకులపై చిరు పోరాడతారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద మెగాస్టార్ కోసం కొరటాల శివ మంచి కాన్సెప్ట్నే పట్టారు. అంతేకాదు, ఈ సినిమాలో విజయశాంతిని కూడా ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
For More Information Visit: https://twitter.com/hashtag/Chiru152