Hyderabad Book Fair 2019 Timings, 33rd Hyderabad Book Fair Hyderabad, Book Fair in Hyderabad 2019 Dates, upcoming book fair in Hyderabad.
The 32nd Hyderabad Book Fair will begin on December 23rd at the NTR stadium. Book Fair Society chief Juloori Gowrishankar said that apart from books for competitive examinations, rare novels, books on science and technology, arts and culture, life histories of eminent personalities, etc., would be on display at the book fair, at nearly 320 stalls of various publishers.
Hyderabad Book Fair 2019 Timings
ఒక పుస్తకం అనేది సమాచారాన్ని రచన, చిత్రాల రూపంలో ఏర్చికూర్చి పొందుపర్చడానికి ఒక మాధ్యమం. ‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని మహాకవి కాళోజి అన్నారు. అంటే పుస్తక రూపంలో దాగిన అక్షరాలకు ఎంత శక్తి వుందో ఇట్లే అర్థమవుతోంది. అలాంటి ఉత్తమోత్తమమైన పుస్తకాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసువచ్చేవే.. “పుస్తక మహోత్సవాలు”.
పుస్తక ప్రాధాన్యత అమితంగా తెలిసిన మన దేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు నేషనల్ బుక్ ట్రస్ట్ స్థాపించారు. ఆ సంస్థ తొలి పుస్తక ప్రదర్శన ముంబైలో 1966 – నవంబర్‌లో నిర్వహించారు. ఆ క్రమంలో పలు రాష్ర్టాలు ఈ మహోత్సవంలో పాల్గొన్నాయి. అనంతరం, ఈ ప్రదర్శనలు రాష్ట్ర రాజధానులకు సైతం పాకాయి. ఈ నేపథ్యంలో వచ్చినవే.. కలకత్తా బుక్ ఫెయిర్, ఢిల్లీ బుక్ ఫెయిర్, చెన్నై బుక్ ఫెయిర్, బెంగుళూరు బుక్ ఫెయిర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్, విజయవాడ బుక్ ఫెయిర్లు.
మొట్ట మొదట 1986లో అశోక్‌నగర్‌లోని సిటీ గ్రంథాలయంలో కేవలం 50 మంది పబ్లిషర్స్‌తో మొదలైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనతి కాలంలోనే కలకత్తా బుక్ ఫెయిర్ తరువాత ద్వితీయ స్థానానికి చేరింది. ప్రస్తుతం, దాదాపు 350 స్టాళ్లతో పలు జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలతో 33వ జాతీయ పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎదిగింది.
Book Fair in Hyderabad 2019 Dates
Here is some good news for book lovers. The annual Hyderabad Book Fair is back, and this time, it will be held from 23rd December 2019 1st January 2020 at Telangana Kala Bharathi (N.T.R Stadium), Lower Tank Bund.
The fair will be open from 2.00 p.m. to 8.30 p.m on weekdays & 12.00 Noon to 9.00 p.m on Weekends & Holidays, and for students entry is free .
ప్రతి యేట జరిగే తెలంగాణ కళా భారతి ప్రాంగణంలో (ఎన్టీఆర్ స్టేడియం – ఇందిరా పార్కు) ఈనెల 23వ తేదీ నుంచి జనవరి (2020) 1వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగించనున్నారు.ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఒక సమాజ సంస్కృతిని అంచనా వేయాలంటే.. ఆ సమాజంలో వెలువడే పుస్తకాల ఆధారంగా అంచ నా వేయొచ్చు. తెలంగాణ మట్టి మనిషి అయిన వట్టికోట ఆళ్వారు స్వామి స్ఫూర్తితో హైదరాబాద్ మహా నగరానికి పరిమితమైన పుస్తక ప్రదర్శనలను జాతీయ పుస్తక ప్రదర్శనగా తీర్చిదిద్దాం.
ఒక్క హైదరాబాద్‌లో నే నెలకు 50 పుస్తకాల వరకు ఆవిష్కరణలు అవుతున్నాయంటేనే పాఠకుల కొరత లేదని చెప్పొచ్చు. కొత్తతరం పాఠకులను సృష్టించేందుకు “బాల మేళా” పేరుతో బుక్ ఫెయిర్‌లో పలు కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దీనికి పిల్లలు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులనుంచి అద్భుతమైన స్పందన ఉంది.