Inavolu Mallanna Jathara 2020: Inavolu Mallikarjuna Swamy Temple situated at Inavolu village of Vardhannapet Mandal Warangal District and Telangana State is one of the ancient Lord Shiva temples in South India.
The temple dates back to 11th century and was built by Kakatiya rulers. It was built with 108 pillars and has a giant magnificent Nruthaya Mandapam on eastern side. Historical Kakatiya Keerti Toranams (Giant Rocky Entrance Gates) were initially constructed here and subsequently at Warangal fort.
Inavolu Mallanna Jathara 2020
Inavolu Mallanna Jathara is the annual festival held at Inavolu Mallikarjuna Swamy Temple in Telangana. The fair and festival at this ancient Shiva temple lasts for 3 months. In 2020, the Inavolu Mallanna Jathara begins on January 14 and concludes on April 8. The most important dates are January 14 and January 15, 2020.
చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 13 నుంచి వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఐనవోలుకు వచ్చిన మంత్రులు మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టీ రాజయ్య, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కుడాచైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్తో కలిసి సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో రూ. 5.35 కోట్లతో నిర్మించే డార్మెటరీ హల్, ఫంక్షన్‌హాల్, అన్నదానసత్రం, ఈవో కార్యాలయం, దాతల సహకారంతో నిర్మించే 45 గదులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు అల్లోల, ఎర్రబెల్లి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఆలయాభివృద్ధికి రూ.50 లక్షల మంజూరు చేస్తానని ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.
వైభవంగా అతిరుద్ర యాగం ప్రారంభం
రెడ్డికాలనీ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం అతిరుద్రయాగం వైభవంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు తాటిపల్లి శ్రీనివాస్-రోజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన యాగంలో ముఖ్యఅతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమక్క-సాలరమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు రూ.75 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. జాతరకు జాతీయ హోదా లభించేలా కృషి చేస్తున్నామన్నారు.