నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ గ్రహీతలకు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ..
సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. ఎంతో సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్నారని శ్లాఘించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఢోకాలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆషామాషీ పథకం కాదని కొనియాడారు.