Telangana State Info

Get Latest All Telangana State Updates

  • Home
  • Telangana News
  • Telangana Tourism
  • Telangana Govt Schemes
  • Education / Careers

సీఎం నూతన అధికారిక నివాసం ప్రారంభం

11/24/2016 By admin

రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాస గృహప్రవేశం నేడు జరిగింది. ఈ తెల్లవారుజామున 5.22 గంటలకు సీఎం కేసీఆర్ గృహప్రవేశం చేశారు.

ఈ కార్యక్రమానికి చినజీయర్‌స్వామితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది.

pragathi-bhavan2

ఈ భవనాల సముదాయానికి ప్రగతిభవన్‌గా నామకరణం చేశారు. వీటిలో వివిధ వర్గాలతో భేటీ అయ్యే సమావేశ మందిరానికి జనహిత పేరును పెట్టారు.

దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.

https://www.youtube.com/watch?v=2vHurUPOWk0

Filed Under: Telugu News

రేపటి నుంచి నగదు మార్పిడి లేదు కేంద్రం ప్రకటన

11/24/2016 By admin

పాత నోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి నుంచి పాత నోట్ల మార్పిడిని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

రేపటి నుంచి నగదు మార్పిడి లేదు
కేంద్రం ప్రకటన

రేపట్నుంచి పాత రూ.1000, రూ.500 నోట్లను బ్యాంకుల్లో కేవలం డిపాజిట్‌ చేసుకొనేందుకే అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుత్తు, నీటి బిల్లులు సహా పలు వినియోగ ఛార్జీలకు పాత రూ.500 నోట్లతో చెల్లించుకొనే గడువు నేటితో ముగియడంతో, ఆ గడువును పాత రూ.500 నోట్లతో డిసెంబర్‌ 15 వరకు చెల్లించుకొనే వెసులుబాటు కల్పించింది.

ఇకపై పాత రూ.1000 నోట్లతో బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది.

దేశంలోని జాతీయ రహదారులపై విధించే టోల్‌ రుసుం గడువును డిసెంబర్‌ 2వరకు పొడిగించిన కేంద్రం డిసెంబర్‌ 3 నుంచి 15 వరకు పాత రూ.500 నోట్లతో ఆ రుసుంను చెల్లించుకోవచ్చని సూచించింది.* విదేశీయులు వారానికి రూ.5వేలు కరెన్సీని మార్చుకొనే అవకాశం కల్పించింది.

రూ. 500 పాత నోటుతో రూ.500 వరకు ప్రీపెయిడ్‌ మొబైల్‌ టాపప్‌కు అవకాశమిచ్చింది.

సహకార రంగం సూపర్‌బజార్లలో పాత నోట్లతో కొనుగోళ్లను రూ.5వేల వరకు పరిమితం చేసింది.

అవినీతి, నల్లధనం, ఉగ్రవాదంపై పోరులో భాగంగా దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 8న రాత్రి ప్రధాని మోదీ వెల్లడించిన నిర్ణయంతో ప్రజలు తమ వద్ద ఉన్న రూ.1000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకొనేందుకు, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకొనేందుకు బ్యాంకుల ఎదుట క్యూలు కడుతున్నారు.

https://www.youtube.com/watch?v=CN21muieOM4

Filed Under: Telugu News

భాగ్యనగరంలో సొరంగ మార్గం వచ్చేస్తోంది !

11/19/2016 By admin

భాగ్యనగరంలో విభిన్న రకాల రహదారులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఆకాశ మార్గాలు, పైవంతెనలు, దుర్గం చెరువుపై వేలాడే వంతెన రోడ్డు, బీఆర్‌టీఎస్‌ వంటి పలు రకాల రహదారుల పనులు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి ఖాజాగూడ కూడలి వరకు సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే నగరంలోని రహదారులు విదేశాలను తలదన్నేలా ముస్తాబు కానున్నాయి.

hyd-top1a

ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాటితోపాటు నగరంలోనే అనేక రకాల రహదారులపై ప్రయాణించామనే అనుభూతిని నగరవాసులు సొంతం చేసుకోనున్నారు. పర్యాటకమూ కొత్త కళ సంతరించుకోనుంది. మహా నగరం పరిధిలో రహదారులను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సమగ్ర రహదారి అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద ఐదు దశల్లో పనులు చేపట్టేందుకు నిర్ణయించిన బల్దియా, ఎల్‌బీనగర్‌, కేబీఆర్‌ పార్కు ప్రాంతాల్లో ప్రారంభించింది.

ఆ ప్రాజెక్టు పూర్తయితే ప్రధాన రహదారులకు సమాంతరంగా ఆకాశ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రజా రవాణాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన బీఆర్‌టీస్‌కు కూడా జీహెచ్‌ఎంసీ తాజాగా పచ్చజెండా వూపింది. బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఆర్‌టీసీ బస్సులు ఆగి, ఆగి ప్రయాణించే దుస్థితి పోతుంది. ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కోకుండా ప్రయాణికులు వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని అధికారులు అంటున్నారు.

ఈ రోడ్లపై ఆర్‌టీసీ బస్సులకు ప్రత్యేకించిన మార్గం ఉంటుంది. అందులో ప్రైవేటు వాహనాలకు ప్రవేశం ఉండదు. బస్టాపులూ రోడ్డు మధ్యలోనే ఉంటాయి. ఇక దుర్గం చెరువు వద్ద చేపట్టిన వూగే వంతెన నిర్మాణం నగరానికి మరో కొత్త అందాన్ని తీసుకొస్తుందనే చెప్పాలి. రూ.184కోట్లతో నిర్మాణంకానున్న ఈ వంతెన పొడవు 230 మీటర్లు. వెళ్లే వాహనాలకు మూడు లేన్లు, వచ్చే వాహనాలకు తదుపరి మూడు లేన్లను రవాణాకు కేటాయిస్తారు. పాదచారులు సైతం వంతెనపై ఉండే ఫుట్‌పాత్‌పై నడుస్తూ దుర్గం చెరువు అందాలను వీక్షించే సదుపాయం ఉంటుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ దాన్ని నిర్మించనుంది. 2019కి ఈ వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారుల అంచనా. దాని వల్ల హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులన్నికీ నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై మాత్రం అధికారుల్లో స్పష్టత లేదు.
కేబీఆర్‌ పార్కు చుట్టూ.. ప్రస్తుతం కేబీఆర్‌ పార్కు చుట్టూ కొన్ని రోడ్లు విస్తారంగా ఉండగా, కొన్ని తక్కువ వెడల్పుతో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారులు చేపట్టిన రహదారి అభివృద్ధి పనులతో పార్కు చుట్టూ ఉండే రోడ్లన్నీ 120 అడుగుల వెడల్పుతో ప్రయాణానికి సిద్ధం కాబోతున్నాయి. ప్రస్తుతం జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 92 వెడల్పు 100 అడుగులు ఉండగా, దాన్ని 120 అడుగులకు విస్తరిస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. అలాగే 80 అడుగుల వెడల్పున్న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌-2, 10, 12, 14, జూబ్లిహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌-45లూ 120 అడుగులకు మారనున్నాయి. ఇక ఫిల్మ్‌నగర్‌ రోడ్డు, జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36 రోడ్డు ఇప్పటికే 120 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఈ ఎనిమిది రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే కేబీఆర్‌ పార్కు చుట్టూ 120 అడుగుల వెడల్పుండే రోడ్లు అందుబాటులోకి వస్తాయి. హైటెక్‌ సిటీ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి.

300 మీటర్ల సొరంగ మార్గం

అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఇనార్బిట్‌మాల్‌ వరకు దుర్గం చెరువుపై వేలాడే వంతెన నిర్మాణం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న రహదారిని పొడిగించి ఖాజాగూడ కూడలి వద్దకు రోడ్డు వేయాలనేది జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన. ఈ పనులు పూర్తవ్వాలంటే అడ్డుగా ఉండే పెద్ద రాతి కొండను తొలగించాలి. అందుకోసం సుమారు 300 మీటర్లు తవ్వాల్సి ఉంటుంది. అయితే పెద్దపెద్ద బండరాళ్లు, చక్కని పచ్చదనంతో ఆ కొండ హైటెక్‌ సిటీ వైపు నుంచి అందంగా కనిపిస్తుంటుంది. దాంతో దాన్ని తొలిచి రోడ్డు నిర్మించడంపై అధికారుల్లో భిన్న వాదనలు వచ్చాయి.

ఫలితంగా జీహెచ్‌ఎంసీ సొరంగ మార్గం నిర్మించేందుకు మొగ్గు చూపింది. మంత్రి కేటీఆర్‌ అంగీకారం తెలిపినట్లు బల్దియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ రోడ్డుతో హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ల నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వెళ్లేవారు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఖాజాగూడ కూడలి నుంచి దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మీదుగా నేరుగా గమ్యాన్ని చేరుకునే సౌలభ్యం వస్తుంది.

Filed Under: Telugu News

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్

11/18/2016 By admin

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఖజానాపై చూపిన ప్రభావం గురించి, సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. మోదీతో శనివారం సమావేశం కానున్నారు.

నోట్లరద్దు అనంతరం రాష్ట్రంలోని వివిధ శాఖల ఆదాయంపై ఉన్నతాధికారులతో కేసీఆర్ గురువారం సమీక్ష జరిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, ఈ విషయాన్ని ప్రధానికి తెలియజేస్తానని, రాష్ర్టాన్ని ఆదుకోవాలని కోరుతానని సీఎం చెప్పారు.నోట్లరద్దు కారణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై పడిన ప్రభావం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్ శనివారం చర్చించనున్నారు. సీఎం శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.వెయ్యినోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ, నగదు జమపై పరిమితులు విధించడం తెలిసిందే.

ఈ పరిణామాలపై కేసీఆర్ గత వారం రోజులుగా వివిధ రంగాల మేధావులతో చర్చించారు. నల్లధనంపై కేంద్రప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఆహ్వానించదగిన పరిణామమేనని రాష్ట్ర సర్కారు ఇప్పటికే ప్రకటించింది. అయితే, నోట్లరద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా కేంద్రప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్‌లో డబ్బు ప్రవాహం తగ్గి ప్రభుత్వ ఆదాయంలో పెద్ద ఎత్తున కోత పడుతున్నదని, రాబోయే ఆరునెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

నోట్లరద్దు నిర్ణయం అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు.. రాష్ట్ర ఖజానాకు కీలకంగా నిలిచే వివిధ శాఖల ఆదాయాలను సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొన్ని శాఖల ఆదాయం గణనీయంగా పడిపోయిన విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. మన రాష్ట్ర పరిస్థితినే ఉదాహరణగా చూపిస్తూ.. దేశంలోని వివిధ రాష్ర్టాల ఆర్ధిక పరిస్థితులు ఎలా మారనున్నాయన్న దానిని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ వివరించనున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా వ్యతిరేకించకుండా.. సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభు త్వం, ఆర్బీఐ తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ లిఖిత పూర్వకంగా ప్రధానమంత్రికి నివేదికను ఇవ్వనున్నారు. మరోవైపు, గతనెల కేంద్రప్రభుత్వం పన్నుల వాటాగా రాష్ర్టానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు ఇవ్వలేదు. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి సీఎం తీసుకువెళ్లనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన గ్రాంట్లు, నిధులను ఇవ్వాలని, హైకోర్టును విభజించాలని కోరనున్నట్లు సమాచారం.

అందరినీ ఒకేగాటన కట్టవద్దు

సామాన్యులు దాచుకునే డబ్బును.. నల్లకుబేరులు దాచుకునే డబ్బును ఒకేగాటన కట్టవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సామాన్యులు దాచుకునే డబ్బును మార్చుకోవడానికి మానవతా దృక్పథంతో అవకాశం ఇవ్వాలన్నారు. ఈ మేరకు తాను ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తానన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో రాష్ర్టాన్ని ఆదుకోవాలని కోరుతానని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావం ఎంత మేరకు ఉందనే విషయంపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌చంద్ర, ఎంజీ గోపాల్, ఎస్కె జోషి, ఎస్పీ సింగ్, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, స్మితాసబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సందీప్‌సుల్తానియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రక్షాళన జరిగితే మద్దతు

ఆర్థ్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణ్ణయం దోహదపడితే ప్రధానికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నతస్థాయికి పురోగమించాలని ఆకాంక్షించారు. ఆలోచనాపరులు, మేధావులు కలిసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా చూడాలని ఆభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా ప్రజలను పరిగణలోకి తీసుకోవాలని, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సంపూర్ణ ప్రక్షాళన దిశగా సాగాలని, అలాకాకుండా ఏ కొందరికోమాత్రమే ఉపయోగపడే విధంగా ఉండకూడదని సీఎం ఈ సందర్భంగా అన్నారు. సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని, దానికి హృదయంతోపాటు మెదడును కూడా జోడించినప్పుడే సంపూర్ణక్రాంతి సిద్ధించి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

https://www.youtube.com/watch?v=B3mL5zZQ7YE

Filed Under: Telugu News

ఏటీఎం వద్దు పెట్రోల్ బంకుల్లో నగదు రూ. 2 వేలు తీసుకోండి

11/18/2016 By admin

నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇన్ని రోజులు క్యూలో నిలబడి సమస్యలు ఎదుర్కొన్న ప్రజలకు ఇక ముందు పెట్రోల్ బంకుల్లో నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

దేశంలోని వివిధ చోట్ల ఉన్న 2,500 పెట్రోల్ బంకుల్లో నగదు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చెయ్యడం ద్వారా రోజుకు రెండు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఒక వ్యక్తి.. మ్యాగ్జిమమ్ 2వేలు మాత్రమ తీసుకోవచ్చు. దీంతో… బ్యాంకులు, ఏటీఎంల ముందు… క్యూలు తగ్గుతాయని భావిస్తోంది కేంద్రం. అయితే ఇది హైదరాబాద్ లో ప్రారంభం కావడానికి మరో రెండు , మూడు రోజులు సమయం పట్టొచ్చని అంటున్నారు.

దీనిపై ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపారు ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య. ఏటీయంలు, బ్యాంకుల ముందు రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. త్వరలోనే మరిన్ని బ్యాంకులతో మాట్లాడి ఈ సదుపాయాన్ని విస్తరించనున్నామన్నారు. 20,000 పెట్రోల్ బంకుల్లో నగదు తీసుకునే వీలు కల్పించనున్నారు.

Govt: Cash to be dispensed at 2500 petrol pumps; Cash to be given by swiping of debit/credit card via POS machine pic.twitter.com/Rw5ccwK9K0

— Doordarshan News (@DDNewsLive) November 17, 2016

Filed Under: Telugu News


Top Stories

Bathukamma Songs 2020 – Mangli, Jyothi Akka DJ Songs MP3

Bathukamma Songs 2020 - Mangli Bathukamma Song, Jyothi Akka Bathukamma Song, 'Bathukamma', the floral festival of Telangana, will be held from October … [Read More...]

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020

Telangana Municipal Corporations Mayors, Deputy Mayors List 2020: Municipality elections across Telangana State Completed, TRS Party swept all the … [Read More...]

Medaram Jatara 2020 – Sammakka Sarakka Jatara

Medaram Jatara 2020 are Sammakka Sarakka Jatara 2020 is a tribal festival of honour the goddesses celebrated in the Telangana State, South India. … [Read More...]

Telangana Traffic Police Challan Pay Online – TS e Challan App Download @ echallan.tspolice.gov.in

Telangana Traffic Police Challan Pay Online, TS e-Challan App Download at echallan.tspolice.gov.in, with the latest traffic rules, there have been a … [Read More...]

Telangana Municipal Mayors Chairman Reservation List 2020

Telangana Municipal Mayors Chairmen Reservation List 2020: The reservations of municipal chairmen and mayors for the ensuing municipal elections have … [Read More...]

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise – Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number

YSR Rythu Bharosa List 2020 Phase2 District wise, Check Rythu Bharosa Scheme Payment Status by Aadhaar, Mobile Number at official website, AP YSR … [Read More...]

Hyderabad Book Fair 2019 Timings – Book Fair in Hyderabad 2019 Dates

Hyderabad Book Fair 2019 Timings, 33rd Hyderabad Book Fair Hyderabad, Book Fair in Hyderabad 2019 Dates, upcoming book fair in Hyderabad. The 32nd … [Read More...]

Disclaimers | Privacy Policy | Contact Us


© Telangana State Info - All Copyrights Reserved.


NOTE: The Information Provided Here In This Site Is Only For Reference Purpose. Please Visit The Respective Official Websites For Complete Details.